రైస్ పుల్లింగ్ మిషన్ తో డబ్బులు వస్తాయని నమ్మబలికి కొంతమందిని మోసం చేసి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను బూర్గంపాడు ఎస్ఐ రాజేష్ పోలీసులతో కలిసి శనివారం పట్టుకున్నారు. సిబ్బందితో కలిసి ఎస్ఐ సారపాక సెంటర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడగా వారిని విచారించారు. వారి నుంచి 1. 90 లక్షలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.