మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి స్థానిక సీఐ వెంకటేశ్వర రావు, ఎస్ఐ రాజ్ కుమార్ తో కలిసి పినపాక గోదావరి పరివాహక ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. డిఎస్పీ మాట్లాడుతూ అనుమానత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అసాంఘిక శక్తులకు సహకరించి కేసుల పాలు కావద్దని సూచించారు.