కరకగూడెం మండలం చొప్పాల గ్రామానికి చెందిన వరుణ్ తేజ (5) జూన్ 29న ఇంట్లోని ఓ కూల్ డ్రింక్ సీసాలో నిల్వ ఉంచిన గడ్డి మందు తాగాడు. ఆ బాలుడికి వాంతులు కావడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబీకులు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.