కరకగూడెం మండలంలోని రాళ్లవాగు వద్ద బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఒకదాని కొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పద్మాపురం గ్రామానికి చెందిన గోవిందరావు, పినపాక మండలంలోని గోవిందాపురానికి చెందిన వ్యక్తికి గాయాలు కాగా, వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరినీ 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.