ఏజెన్సీ ప్రాంతంలో అమాయక ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆదివాసి జేఏసీ నాయకులు రవికుమార్ దొర అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని కలిసి జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో మేమున్నాం అని గొప్పలు చెప్పుకొని, ఏదైనా సమస్య వస్తే మాత్రం వాడు ఏ పార్టీ, వీడు ఏ పార్టీ అంటూ భేదాభిప్రాయాలతో వర్గ రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు.