మణుగూరు పట్టణంలోని రాజుపేట గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని మంగళవారం లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామం మీదుగా వెళ్లే లారీలను నిలిపి ఆందోళన చేశారు.