అశ్వాపురం అమెర్దాకాలనీ వద్ద ఉన్న సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువలో అదే కాలనీకి చెందిన యాసా నవీన్(38) అనే వ్యక్తి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. మృత దేహం బాగా ఛిద్రమై ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో చాలా కాలం కిందటే వారు ఇక్కడి నుంచి వెళ్లిపోయి వేరే గ్రామంలో ఉంటున్నారు. నవీన్ ఒక్కరే గ్రామంలో ఉంటున్నాడు. ఘటనా స్థలాన్ని సీఐ జి. అశోక్డ్డి పరిశీలించారు. కుటుంబసభ్యులు రాలేదని, ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు.