రెజొనెన్స్ లో వైభవంగా సంక్రాంతి వేడుకలు

80చూసినవారు
రెజొనెన్స్ లో వైభవంగా సంక్రాంతి వేడుకలు
ఖమ్మం శ్రీనివాస నగర్ లో రేజోనెన్స్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాఠశాల డైరెక్టర్ ఆర్.వి నాగేంద్ర కుమార్, నీలిమలు ముఖ్య అతిధులుగా పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్ధులను భోగి పళ్ళతో దీవించి ఎద్దుల బండి, గంగిరెద్దులు,బొమ్మల కొలువు మరియు విద్యార్ధుల అందమైన రంగోలి ముగ్గులను తిలకిస్తూ గొప్ప సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్ధులకు వివరించారు. భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ గురించి తెలియజేస్తూ రైతులందరికీ వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే ఎద్దుల మీడలో దండలు వేస్తూ పచ్చిగడ్డి, తెలగ పిండి, అరటిపండ్లు నైవేద్యంగా తినిపించారు. ప్రకృతితో చేయవలసిన సహజీవన విధానాలు సంక్రాంతి పండుగలో అణువణువునా దర్శనమిచ్చాయి. మనిషి తను పొందిన సంపదను పది మందితో పంచుకోవాలనే విషయాన్ని చిన్నారులకు వారి బాధ్యతను తెలియజేసే గొప్ప సంస్కృతి నిలయం సంక్రాంతి పండుగ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్ధులు మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్