సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అదనపు కలెక్టర్

60చూసినవారు
సత్తుపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ సూపరింటెండెంట్ కే. వెంకటేశ్వర్లును ఆదేశించారు. శనివారం ఆమె స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. పరికరాలను త్వరగా బిగించి ఆసుపత్రి భవనాన్ని తమ ఆధీనంలో తీసుకోవాలని కోరారు. ఆసుపత్రిలో మందులు, వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్