తల్లాడ మండలం అంజనాపురం భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా గిరిజన నాయకులు తేజావత్ బాలాజీ నాయక్ గుండెపోటుతో మరణం చెందిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకులు డాక్టర్ శీలం పాపారావు బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో బలమైన నాయకులను కోల్పోవటం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొనటం జరిగింది.