వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా గొర్ల సత్యనారాయణ రెడ్డి (బులి బాబు) జ్ఞాపకార్ధంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజముల బండ లాగుడు ప్రదర్శనలు గురువారం ప్రారంభించటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డా మట్టా దయానంద్ విజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలు మూడు రోజులు పాటు ఉత్సాహంగా జరగనున్నాయి.