విశాఖలో 75 అడుగుల బెల్లం గణపయ్య
వినాయక చవితి సందర్భంగా ఏపీలోని విశాఖపట్నం గాజువాక వాసులు బెల్లంతో వినాయకుడిని రూపొందిస్తున్నారు. 75 అడుగుల ఎత్తైన ఈ వినాయకుడి విగ్రహం తయారీకి రాజస్థాన్ నుంచి 20 టన్నుల బెల్లం తెప్పింపారు. విగ్రహం తయారీ దాదాపుగా పూర్తయిందని మండపం నిర్వాహకులు చెబుతున్నారు.