సత్తుపల్లిలో సీపీఎం 22వ జిల్లా మహాసభలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. స్థానిక రావి వీరవెంకయ్య భవనం నుంచి మహాసభ వేదిక వరకు వందలాది మంది కార్యకర్తలతో పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఇటీవల పార్టీలో మృతి చెందిన కార్యకర్తలకు సంతాప తీర్మానం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రధాన రహదారి, కూడళ్ళలో అంతా ఎరుపెక్కింది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అతిథిగా పాల్గొన్నారు.