విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి

73చూసినవారు
విద్యుత్ షాక్ తో పాడి గేదె మృతి
విద్యుత్ షాక్ కు గురై పాడి గేదె మృతి చెందిన సంఘటన శనివారం తల్లాడ మండలం కేశ్వాపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టా విజయలక్ష్మి, రోశయ్య దంపతులకు చెందిన పాడి గేదె ఉదయం మేతకు వెళ్లింది. గ్రామ శివారులో వాగు సమీపంలో త్రీఫేజ్ విద్యుత్ వైరు తెగిపడి పాడి గేదెకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గెదె విలువ సుమారు లక్ష రూపాయలు ఉంటుందని రైతు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్