ఏన్కూర్: కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి

73చూసినవారు
ఏన్కూర్: కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి
ఏన్కూర్ మండల పరిధిలోని కోనాయపాలెం గ్రామంలో బుధవారం దారుణం జరిగింది. కంట్లో కారం చల్లి మామ పై కోడలు దాడి చేసింది. కంట్లో కారం చల్లడంతో ఆ వృద్ధుడు ఆర్తనాదాలు చేశాడు. ఈ దాడికి పాల్పడిన సదరు మహిళ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తుండటం గమనార్హం. దీంతో స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్