డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సీజన్ వ్యాధులు రాకుండా దోమల నివారణకు ఇళ్ల పరిసరాల్లో సిబ్బంది నిరోధక రసాయనాలతో పిచికారి చేశారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్బంగా పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్మన్ కే. మహేష్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు.