రంజాన్ మాస సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని జామె మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులతో ప్రతి సంవత్సరం ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలపటం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, తదితరులు పాల్గొన్నారు.