సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆవుదూడకు అంత్యక్రియలు నిర్వహించారు. పాత సెంటర్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఖమ్మం నుంచి వెళ్లున్న లారీ ఆవుదూడను ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా మున్సిపాలిటీ వాహనంలో ఊరేగిస్తూ వేశ్య కాంతల చెరువు వద్ద ఖననం చేశారు. పోలీసులు లారీని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.