కల్లూరు: రైతులకు గన్నీ సంచులు అందించాలి

51చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందుబాటులో గన్నీ సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఆదివారం రైతుసంఘం ఆధ్వర్యంలో కల్లూరు మండలంలోని రావికంపాడు, పుల్లయ్యబంజర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు సత్యనారాయణరెడ్డి, హనుమంతరావు, అంజయ్య, వెంకటేశ్వరరావు, కృష్ణార్జునరావు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్