కల్లూరులో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రైతులు కల్లాలో ఆరబెట్టిన ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం ఈదురుగాలులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పుల్లయ్య బంజారలో కల్లాలలో, రహదారులపై ఆరబోసిన ధాన్యం వరద నీటి పాలైంది. ఈదురు గాలికి కప్పిన పట్టాలు సైతం ఎగిరిపోయి ధాన్యం తడిసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం చెల్లా చెదరవటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.