Top 10 viral news 🔥


త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం
మహా కుంభమేళాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సంగమ్ వద్ద పడవలో ఆయన విహరించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నదిలో ప్రార్థనలు చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట ఉన్నారు. తొలుత ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు వెళ్లారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు.