రైతులకు అవసరానికి తగ్గట్టుగా గన్నీ సంచులు సరఫరా చేయాలని రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కల్లూరు మండల పరిధిలోని రావికోపాడు, పుల్లయ్యబంజర గ్రామాలలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బొంతు పరిశీలించి రైతుల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తరుగు పేరుతో మిల్లర్లు ధగా చేస్తే సహించమన్నారు.