ఖమ్మం: టీడీపీ అధ్యక్షునిగా భీమిరెడ్డి ఎన్నిక

83చూసినవారు
ఖమ్మం: టీడీపీ అధ్యక్షునిగా భీమిరెడ్డి ఎన్నిక
ఖమ్మం జిల్లా వేంసూరు మండల టీడీపీ పార్టీ మండల అధ్యక్షులుగా మండల పరిధిలోని మర్లపాడు గ్రామానికి చెందిన భీమిరెడ్డి మురళీధర్ రెడ్డి శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భీమిరెడ్డి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పట్టిన పసుపు జెండాను వదలకుండా, కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగుదేశం బలోపేతానికి శ్రమించారు. వేంసూరులో మిత్రులు భీమిరెడ్డికు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్