ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని బీరాపల్లి గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మ మాట - అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని సూపర్ వైజర్ భవాని ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఇన్ ఛార్జ్ సీడీపీఓ మెహ్రూనీసా బేగం పాల్గొన్నారు. ఐదేళ్ల లోపు బాల బాలికలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని, ప్రభుత్వం అందించే రాయితీలు పొందవచ్చని లబ్ధిదారులకు తెలిపారు. అంగన్వాడీ టీచర్స్, గ్రామస్థులు పాల్గొన్నారు.