హీరో అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. 'సీఎం రేవంత్ రెడ్డి నీ క్యారెక్టర్ తక్కువ చేయడం లేదు. ఆయన కామెంట్లపై ప్రెస్ మీట్ పెట్టావు. బెనిఫిట్ షో రోజు పోలీసులు నీ మెడ పట్టుకొని గెంటేస్తామని చెబితే బయటకు వచ్చావు. తెలంగాణ పులి బిడ్డ రేవంత్ రెడ్డితో పెట్టుకోకు. ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తే మర్యాద దక్కదు' అంటూ పిడమర్తి రవి బన్నీని హెచ్చరించారు.