విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరు స్నేహితులు జల్సాలకు అలవాటు పడి సైబర్ నేరాల ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే సత్తుపల్లికి చెందిన ఒక యువకుడికి ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వివిధ కారణాలు చెబుతూ డబ్బు తీసుకుంది. బాధితుడు శ్రీకాంత్ తిరిగి డబ్బు అడగగా తన ఫ్రెండ్ తో బెదిరించి దాదాపు 16 లక్షల రూపాయలు లాగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆదివారం వారిని పట్టుకున్నారు.