ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మట్టా

55చూసినవారు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం పేషంట్లతో మాట్లాడి, వైద్యులు సరైన వైద్యం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం దయానంద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలను చేపించుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్