నీట మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

82చూసినవారు
నీట మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి మండలం తుంబూరు, కిష్టాపురం గ్రామాలలో గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా సుమారు 260 ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. బుధవారం ఎమ్మెల్యే మట్టా రాగమయి జలమయమైన పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. తుంబూరు, కిష్టాపురం గ్రామాల రైతులను కలిసి ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. అధికారులను సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్