తుంబూరు భూభారతి సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

71చూసినవారు
తుంబూరు భూభారతి సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే
సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఎమ్మార్వో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే మట్టారాగమయి బుధవారం పాల్గొన్నారు. భూ సమస్యలు ఉన్న రైతుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్