పెనుబల్లి మండలం లంకపల్లిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దారా ఉపేందర్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 17క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించి ఉపేందర్ పై కేసు నమోదు చేశారు.