
JEE మెయిన్ 'కీ' తొలగించిన NTA
JEE మెయిన్ సెషన్ 2 ఫైనల్ కీ ని NTA ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెబ్సైట్ నుంచి కీ ని NTA తొలగించింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో NTAపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఏప్రిల్ 2 నుంచి 9 వరకు రెండో విడత పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.