
మృతదేహం వద్ద కంటతడి పెట్టుకున్న వానరం
TG: ములుగు జిల్లా బీసీ మర్రిగూడెంలో మూగజీవి చూపించిన ప్రేమ స్థానికుల గుండెను కదిలించింది. వెంకటాపురంలోని దుర్గమ్మ గుడిలో ప్రసాదం పెడుతూ ఓ వానరంతో స్నేహం పెంచుకున్న వీర్రాజు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన రాకలేకపోవడాన్ని గమనించిన వానరం ఇంటికి వెళ్లి మృతదేహం వద్ద కూర్చొని కంటతడి పెట్టింది. కడుపు నింపిన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిన ఈ సంఘటనను చూసిన గ్రామస్తులు వానర ప్రేమకు కంటతడి పెట్టుకున్నారు.