చౌడవరానికి చెందిన సడియం వంశీ(14) వీఎం బంజర ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 7 సైకిల్ పై పాఠశాలకు వెళ్తుండగా లారీ ఢీ కొనడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే దాతలు సాయం చేశారు. వైద్యులు వంశీ కాలు తీసేసారు. అనంతరం వైద్యానికి అతని శరీరం సహకరించక శుక్రవారం మృతి చెందాడు. మండల విద్యాధికారి ఎస్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు వంశీ మృతికి సంతాపం తెలిపారు.