ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని వీఎం బంజర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం టీఎస్ యూటిఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల సీనియర్ నేత వి. తిరుపతి రావు పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో టీఎస్ యూటిఎఫ్ అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామారావు, మండల అధ్యక్షులు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.