పెనుబల్లి: తాళ్లపెంట ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల

81చూసినవారు
పెనుబల్లి మండలంలోని తాళ్లపెంట ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి అవసరాలకు సాగర్ జలాలను శుక్ర వారం విడుదల చేశారు. కల్లూరు మార్కెట్ చైర్మన్ బాగం నీరజా ప్రభాకర్ చౌదరితో కలిసి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ నీటిని విడుదల చేసి మాట్లాడారు. రైతుల క్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇబ్బందులన్నీ అధిగమించి రైతుల కోసం నీరు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్