సైలో బంకర్ ను తొలగించాలని కోరుతూ సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో 30 రోజులుగా గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలలో భాగంగా మంగళవారం రైల్ రోకో నిర్వహించారు. సింగరేణిలోని సీహెచ్పీ వద్ద బొగ్గు ఉత్పత్తి రవాణాను అడ్డుకొని, పురుగు మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సింగరేణి సంస్థ దిగివచ్చే వరకు పోరాటం ఆగదని ప్రతిఘటించారు.