సత్తుపల్లి పట్టణంలోని మున్సిపాల్టీ పరిధిలో గల అన్ని వార్డులలో బుధవారం నూతన రేషన్ కార్డుల సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. దరఖాస్తుదారుల నివాస ప్రాంతాల్లో వార్డు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్హుల జాబితాను తయారు చేస్తున్నారు. రెండో వార్డు అధికారిని పావని మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా వాస్తవాలను గుర్తిస్తున్నామని, తదుపరి చర్యల నిమిత్తం మున్సిపాల్టీ కమిషనర్ నరసింహకు రిపోర్టు అందజేస్తామన్నారు.