ఆర్టీసీ బస్సు- ఆయిల్ ట్యాంకర్ ఢీ

4879చూసినవారు
సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ లారీని ఢీ కొట్టింది. ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో లారీ డ్రైవర్ ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. స్థానికులు గమనించి డ్రైవర్ ను బయటకు తీశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్