భారతదేశం అన్ని రంగా అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, వికసిత్ భారత్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శీలం పాపారావు తెలిపారు. బుధవారం సత్తుపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గురువారం పట్టణంలోని జెకన్వెన్షన్ హాల్లో వికసిత్ భారత్ పై మేథోమదన సదస్సుకు అందరు హాజరు కావాలన్నారు.