ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ తెలిపారు. సత్తుపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. గత పాలనలో బీసీలకు ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు రిజర్వేషన్లు అమలుచేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం సరికాదన్నారు.