సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం జరిగిన డెవలెప్మెంట్ సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కార్యక్రమాలు, పలు సమస్యల గురించి చర్చించారు. అనంతరం ఆసుపత్రిలో ఓపీ, ఇన్ పేషంట్ల వార్డులు, ల్యాబ్, ఫార్మసీ, తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఇన్ పెషేంట్ లకు అందించే భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.