సత్తుపల్లి పట్టణం నల్లబోతుల ప్రసాద్ ఇటీవల మరణించినారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ శనివారం ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.