తెలంగాణ ఉద్యమకారులైన ప్రొ. జయశంకర్, శ్రీకాంతాచారి విగ్రహాలను సత్తుపల్లిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సత్తుపల్లిలో నిర్వహించిన బీసీ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ప్రో. జయశంకర్, శ్రీకాంతాచారి పేర్లు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు.