సత్తుపల్లిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సింగరేణి గనుల్లో నీరు చేరింది. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో వరద నీరు నిలవడంతో సోమవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కిష్టారం ఓపెన్ కాస్ట్ లో 5వేల టన్నులు, జేవీఆర్ ఓసీలో 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు.