సత్తుపల్లి పట్టణ విద్యుత్ ఉపకేంద్రంలో బుధవారం లింబ్ బ్లాస్ట్ అయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కేవలం గంటల వ్యవధిలోనే పట్టణ విద్యుత్ అసిస్టెంట్ ఇంజినీర్ శరత్ ఖమ్మం నుండి టెక్నీషియన్ లను రప్పించి మరమత్తులు చేయించారు. మధ్యాహ్నం 3: 30 గంటలకు విద్యుత్ సరఫరాను ప్రజలకు అందించారు. దీంతో పట్టణ ప్రజలు, ఫ్యాక్టరీల యజమానులు ఏఈ ఉబ్బన శరత్ కు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించి ఎండను సైతం లెక్కచేయకుండా పని చేసిన టెక్నీషియన్లకు శరత్ అభినందనలు తెలిపారు.