రైతాంగ సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి సత్తుపల్లి మండలంలో పర్యటించి సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డా. మట్టా రాగమయి దయానంద్ తో కలిసి పలు రోడ్డు నిర్మాణ, సింగరేణి వ్యవసాయ గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, కో ఆపరేటివ్ సొసైటీ, జీపీ భవనాలను ప్రారంభించారు.