

40 అడుగుల బావిలో భర్త.. కాపాడిన భార్య
కేరళలో భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు 56 ఏళ్ల భార్య తన ప్రాణాలకు తెగించింది. ఎర్నాకుళం జిల్లాలోని పిరవమ్కు చెందిన ఎక్కి రమేశన్ (64) బుధవారం ఉదయం పెరట్లో మిరియాల చెట్టు ఎక్కి మిరియాలు తీస్తున్నాడు. ప్రమాదవశాత్తు కొమ్మ విరగడంతో 40 అడుగుల లోతైన బావిలో పడిపోయాడు. భార్య పద్మ ఓ తాడు సాయంతో బావిలోకి దిగింది. నీట మునిగి స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న భర్తను రక్షించింది. వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.