సత్తుపల్లిలోని 18, 19, 23వ వార్డుల్లో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డుల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, ర్యాలీని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి అందాలని అన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రజల కష్ట సుఖాల్లో తోడు, నీడగా ఉంటామన్నారు.