టాలీవుడ్ హీరో, నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సత్తుపల్లి పట్టణం బస్టాండ్ రింగ్ సెంటర్ నందు మంగళవారం నందమూరి యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల, పట్టణ నందమూరి అభిమానులు పాల్గొనడం జరిగింది.