సత్తుపల్లి: హోంమంత్రి క్షమాపణ చెప్పాలి

77చూసినవారు
డాక్టర్ బీఆర్. అంబేద్కర్ ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో గురువారం అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ దళితులకే కాక అందరి హక్కులను కాపాడేందుకు పోరాడారని తెలిపారు. మహనీయుడిని అవమానించేలా అమిత్ వ్యాఖ్యలు చేస్తే ప్రధాని మోదీ సమర్ధించడం గర్హనీయమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్